చైతూకు నచ్చిన చెర్నోబిల్

by  |
చైతూకు నచ్చిన చెర్నోబిల్
X

ప్రేమ కథలు, సాఫ్ట్ క్యారెక్టర్స్‌తో ‌సినిమాలు చేస్తున్న అక్కినేని హీరో నాగచైతన్య.. సైలెంట్‌గా హిట్స్ కొడుతున్నాడు. బైక్ రైడింగ్‌తో పాటు కుకింగ్ తనకు ఇష్టమైన హాబీలు కాగా.. తన వంటలను చై బెటర్ హాఫ్ సామ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటుంది. కానీ చై మాత్రం తన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. లాక్‌డౌన్ వేళ ఫిల్మ్ స్టార్స్ అందరూ సోషల్ మీడియాలో సందడి చేసినా గానీ, చై మాత్రం అంతగా కనిపించలేదు. అయితే చైతూ తాజాగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేయడం విశేషం. ఓ వెబ్ సిరీస్ ఎంతగానో నచ్చిందని, మీరు ఇప్పటివరకు చూడకపోతే వెంటనే చూడాలని నెటిజన్లను కోరుతున్నాడు.

నాటి సోవియట్ యూనియన్‌లో ‘చెర్నోబిల్’ అనే అణు విద్యుత్ కేంద్రం ఉండేదట. 1986, ఏప్రిల్ 26న కొన్ని సెకన్ల వ్యవధిలోనే ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకర అణు ప్రమాదం అక్కడ జరిగింది. ఈ ఘటన వల్ల 134 మంది అస్వస్థకు గురవ్వగా.. మొత్తం 47 మంది చనిపోయారు. ఈ ఘటన ఆధారంగా తీసిన టెలివిజన్ మినీ సిరీస్ ‘చెర్నోబిల్’. క్రెయిగ్ మాజిన్ రచయితగా వ్యవహరించగా, జోహన్ రెంక్ దర్శకత్వం వహించాడు. లాక్‌డౌన్ సమయంలో ఈ వెబ్‌ సిరీస్ తనకు ఎంతగానో నచ్చిందని తెలిపాడు. ‘అద్భుత నటన.. రచనతో పాటు నిర్మాణ విలువలు బాగున్నాయన్నాడు. ఇప్పటివరకు ఎవరైనా చూడకుండా ఉంటే తప్పక చూడండి’ అని పేర్కొంటూ చెర్నోబిల్‌ పోస్టర్‌ను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఇన్‌స్టా పోస్ట్‌ తెగ వైరల్‌ అవుతోంది.



Next Story