అక్కినేని కుటుంబానికి దూరంగా చైతన్య.. సమంత విడాకులే కారణమా..?

by  |
అక్కినేని కుటుంబానికి దూరంగా చైతన్య.. సమంత విడాకులే కారణమా..?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ అడోరబుల్ కపుల్ నాగచైతన్య- సమంత విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. విడాకుల అనంతరం వీరిద్దరు ఎక్కడ ఉండబోతున్నారు అనేది అభిమానులను ఎప్పటినుంచో తొలుస్తున్న ప్రశ్న. వీరి పెళ్లి తర్వాత గచ్చిబౌలిలో ఒక విలాసవంతమైన విల్లాను తీసుకొని అందులోనే ఉండబోతున్నట్లు వారు ప్రకటించిన విషయం తెల్సిందే. వారి అభిరుచులకు అనుగుణంగా ఆ ఇంటికి మార్పులు చేర్పులు చేయిస్తున్నట్లు కూడా తెలిపిన ఈ జంట విడాకుల అనంతరం ఆ ఇంటిలో ఎవరో ఒకరే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చై విడాకుల తర్వాత ఒక హోటల్ రూమ్ లో ఉంటున్నట్లు సమాచారం. ఇక సామ్ మాత్రం గచ్చిబౌలిలోని ఇంటికే షిఫ్ట్ అవ్వనున్నదంట.

ప్రస్తుతం చై, కొన్ని రోజులు అందరికి దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే నాగచైతన్య మరో కొత్త అపార్ట్ మెంట్ ని కొనుక్కున్నారు. కొన్నాళ్ల పాటు తన కుటుంబ సభ్యులకు దూరంగా ఒంటరిగా ఈ అపార్ట్ మెంట్ లోనే ఉండనున్నారట. త్వరలోనే చైతూ ఈ ఇంటిలో అడుగుపెట్టనున్నారు. విడాకుల తరువాత సామ్- చైతూ ఇద్దరు ఎవరి కెరీర్ లో వారు బిజీ గా మారారు. ఇటీవలే ‘లవ్ స్టోరీ’ తో హిట్ అందుకున్న చైతన్య తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా మారాడు. ప్రస్తుతం చైతన్య విక్రమ్ కె దర్శకత్వంలో ‘థాంక్యూ’ లో నటిస్తున్నాడు. అమీర్ ఖాన్ తో ‘లాల్ సింగ్ చద్దా’.. నాగార్జునతో ‘బంగార్రాజు’ చిత్రాలలో నటిస్తున్నాడు.



Next Story