బంపర్ ఆఫర్.. కిలో మటన్ 50 రూపాయలే.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే..?

by Anukaran |   ( Updated:2021-12-20 00:06:57.0  )
బంపర్ ఆఫర్.. కిలో మటన్ 50 రూపాయలే.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: మాంసం ప్రియులకు వాల్మీకి పురం వ్యాపారస్తులు గుడ్ న్యూస్ చెప్పారు. పోటీకీ పోయి ఉన్న మాంసాన్ని వినియోగ దారులకు కేవలం 50 రూపాయలకే విక్రయించారు. ఆదివారం సాయంత్రం జనాలు ఎగబడటంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది. సరుకు ఎక్కువగా ఉండటంతో ఒకరిని చూసి ఒకరు ధరలు తగ్గించారు. అది కాస్తా చివరకు 50 రూపాయలకు వచ్చి ఆగింది. వచ్చిందే అవకాశంగా వినియోగదారులు సైతం బారులు తీరి ఐదు నుంచి పది కిలోలు కొన్నారు.

చిత్తూరు జిల్లా వాల్మీకి పురం గాంధీ బస్టాండు పక్కన భారీగా మటన్ దుకాణాలు ఉన్నాయి. అక్కడ ఒక దుకాణ దారుడు కేవలం 300లకే మటన్ అమ్మడం మొదలుపెట్టాడు. దాంతో ఇతర షాపుల వారు ఒకరిని చూసి ఒకరు తగ్గిస్తూ వచ్చారు. 300 నుంచి 200, 100.. 50 ఇలా చివరకు 50 తో స్థిరపడింది. సాయంత్రం 7 వరకు ఈ విక్రయాలు జరిగాయి. ఆదివారం మధ్యహ్నం వరకూ కిలో 400 పైనే సాగింది. ఏమైందో ఏమోగానీ గంటల వ్యవధిలోనే కిలో 50 కి చేరింది.

Next Story

Most Viewed