మ్యూటేషన్ టెన్షన్

by  |
Dharani portal
X

ప్రతినిధి, రంగారెడ్డి: రెవెన్యూ వ్యవస్థలో అవినీతికి ఆస్కారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకోచ్చింది. ఇదే అదునుగా భావించిన కొందరు విక్రయించిన భూములను ధరణి ద్వారా తిరిగి కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, కందుకూర్, రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని పలు మండలాల పరిధిలో ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌కు ముందు విక్రయించిన భూములను తిరిగి ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ప్రధానంగా గండిపేట్, కందుకూర్, మహేశ్వరం, అంబర్‌పేట్, బాలాపూర్, ఇబ్రహీంపట్నం, అబ్ధూల్లాపూర్ మెట్టు మండలాల పరిధిలో ఎక్కు వగా ఉన్నాయి. కొనుగోలుదారులు మ్యూటేషన్ చేయించుకోకపోవడంతో ధరణిలో విక్రయదారులపైనే భూమి కనిపిస్తోంది. దీనిని ఆసరాగా చేసుకొని భూయాజమాన్యులు విక్రయించినప్పుడు ధరలు సాధారణంగా, తక్కువ గా ఉండటంతో… మళ్లీ విక్రయదారులు డబ్బులకు ఆశపడి తిరిగి కుటుంబ సభ్యుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు.

–రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఓ గ్రామంలో విక్రయించిన ఐదు ఎకరాల భూమిని ధరణి ద్వారా తిరిగి భార్య పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

– రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని గండిపేట్ మండల పరిధిలోని నార్సింగ్ మున్సిపాలిటీలోని 10 గుంటల భూమిని విక్రయదారులు తిరిగి తల్లి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు.

–కందుకూర్ డివిజన్లోని మహేశ్వరం మండలంలోని తుక్కుగూడ మున్సిపాలిటీలో లాక్డౌన్ సమ యంలో నాలుగు ఎకరాల భూమిని కోనుగోలు చేశారు. మ్యూటేషన్ చేయించుకునేందుకు కార్యాలయాలు పనిచేయకపోవడంతో ఆగారు. తిరిగి చేయించుకుందామంటే విక్రయదారుడు తమ కొడుకుల పేర్లపై రిజి స్ర్టేషన్ చేశాడు. ఇలా జిల్లా లో ఇటువంటి కేసులు కోకొల్లలు. కోనుగోలు దారులు విక్రయదారులు తిరిగి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారనే విషయం తెలిసిన తర్వాత తహసీల్దార్లను కలిసి మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. దరఖాస్తులను లెక్కచేయకుండా విక్రయదారులకే తహసీల్దార్లు మద్దతు పలుకుతున్నారు. దీంతో కొనుగోలుదారులు తలలు పట్టుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో చేయించుకున్న డాక్యుమెంట్లు ఉన్నా ఫలితం లేకుండా పోయింది.

పాసుబుక్ నెంబర్ దొరికేది ఎలా…

భూ క్రయ విక్రయాలు నిబంధనల ప్రకారం జరిగినప్పటికీ రెవెన్యూ శాఖాధికారులు, ధరణి వెబ్సైట్ ద్వారా కోట్ల రూపాయాల విలువైన భూములు వివాదాస్పదంగా మారనున్నాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారా జరిగిన భూ క్రయ విక్రయాలకు విలువ లేకుండా పోయింది. మ్యూటేషన్ చేసుకోవాలంటే పాసుబుక్ నెంబర్ తప్పనిసరి. కానీ గతంలో విక్రయించిన వ్యక్తి పేరుపై ఉన్న పాసుబుక్ నెంబర్తోనే కొనుగోలుదారుడు ధరణిలో మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అయితే కొనుగోలుదారుడు దరఖాస్తు చేసుకునేందుకు విక్రయదారుడి పాసుబుక్ నెంబ ర్ గల్లంతు కావడంతో మ్యూటేషన్ ఆప్షన్కు సపో ర్టు చేయడం లేదు. అంతేకాకుండా విక్రయదారుడు తిరిగి ఆ భూమిని కుటుంబ సభ్యుల పేరుపై ధరణిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ప్రస్తు తం ఎవరి పేరుపై భూమి ఉందో వారి పాసుబుక్ నెంబర్ ఉండాలి. అంటే వారికి కేటాయించిన పా సుబుక్ నెంబర్ తెలుసుకునేందుకు కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా విక్రయదారులనే పాసుబుక్ నెంబర్ ఇవ్వగలరని కొనుగోలుదారుడు అడిగితే నగదు డిమాండ్ చేస్తున్నారు. పాసుబుక్ నెంబర్ తెలుసుకొని దరఖాస్తు చేసుకున్న భూ యాజమాని మ్యూటేషన్ సహకరించకపోవడంతో వివాధాలకు తావునిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ధరణి వెబ్ సైట్ అందుబాటులోకి తీసుకొచ్చిన కొన్ని నెలల పాటు మ్యూటేషన్ చేసేందుకు ఆప్షన్ ఇవ్వలేదు. ఆ సమయంలో అనేకమంది మ్యూటేషన్ కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. రెవెన్యూ అధికారులు ఇప్పుడు ఆ ఆప్షన్ లేదని వెనక్కి పంపిస్తున్నారు. దరఖాస్తుల ద్వారా గుర్తు చేసినప్పటికి రెవెన్యూ అధికారులు తెలియనట్లుగానే వ్యవహరించి విక్రయించిన భూములను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ జరుగుతున్న సందర్భంలో విషయం తెలుసుకొని కొనుగోలుదారులు వచ్చి రెవెన్యూ అధికారులకు అర్జీ పెట్టుకున్న ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు మ్యూటేషన్ అప్షన్ ఉన్నప్పటికి దరఖాస్తు చేసుకుంటే పూర్వపరాలు తెలుసుకొని విచారణ జరిపి క్లియర్ చేయాల్సిన ఫైళ్లను పెండింగ్లో పెడుతున్నారు.



Next Story

Most Viewed