కోవిడ్‌లో విధుల నిర్వహణ భేష్

by  |
కోవిడ్‌లో విధుల నిర్వహణ భేష్
X

దిశ, వరంగల్ సిటీ:
కరోనా వైరస్ నేపథ్యంలో విధుల నిర్వహణ భేష్ అని బల్దియా కమిషనర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కార్పొరేషన్‌కు చెందిన వివిధ విభాగాలకు చెందిన 17 మంది ఉత్తమ ఉద్యోగులకు కమిషనర్ ప్రశంసా పత్రాలు, నగదును అందజేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హరితహారంలో అన్ని విభాగాల సిబ్బంది పాల్గొనడం వారికి ఒక గొప్ప అనుభూతిని మిగుల్చుతుందన్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సిబ్బంది తప్పకుండా ప్రతిరోజు ఫీల్డ్‌‌లో ఉండాలని, ఒకవేళ వారికి ఏమైనా అనారోగ్య సంబంధ సమస్యలు ఉత్పన్నం అయితే సంబంధిత విభాగ ప్రధాన అధికారికి తెలపాలన్నారు. వారికి రెండ్రోజుల్లో కోవిడ్ పరీక్షలు నిర్వహించేలా చూస్తామని, ఆకారణంగా విధులకు గైర్హాజరుకాకూడదన్నారు.

వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణతో పాటు విధుల నిర్వహణ రెండు అత్యంత ముఖ్యమని తెలిపారు. కింది స్థాయి సిబ్బంది సంక్షేమం కోసం తన మిత్రులు, శ్రేయభిలాషుల సహకారంతో వ్యక్తిగతంగా అకౌంట్ ద్వారా రూ.20 లక్షల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రభుత్వం నుంచి వారికి సహాయం అందడంలో జాప్యం జరిగితే ఈ నిధులను వారికి వినియోగేంచేలా చూడాలన్నారు. ఇప్పటి వరకూ రూ.11 లక్షలను వినియోగించడం జరిగిందని, ఇంకా సుమారు రూ.9 లక్షల ఫండ్ అందుబాటులో ఉందన్నారు. అత్యవసర సమయంలో వీటిని వినియోగించుకోవచ్చని అధికారులకు సూచించారు.

Next Story

Most Viewed