జబర్దస్త్ పోలీస్.. ‘మేరీ సప్నో కి రాణి’ రీక్రియేషన్

by  |
జబర్దస్త్ పోలీస్.. ‘మేరీ సప్నో కి రాణి’ రీక్రియేషన్
X

దిశ, ఫీచర్స్ : బాలీవుడ్ క్లాసిక్ మూవీ ‘ఆరాధన’లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌డీ బర్మన్ స్వరపరిచిన ‘మేరీ సప్నో కి రాణి’ పాటకు ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలియంది కాదు. బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ సాంగ్స్‌లో ఒకటైన ఈ సాంగ్‌ను లెజెండరీ సింగర్ కిశోర్ కుమార్ ఆలపించగా.. అనేక దశాబ్దాలుగా మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే అనేక హిట్ ట్రాక్స్‌ను రీక్రియేట్ చేస్తున్న ముంబై పోలీస్ బ్యాండ్ ‘ఖాకీ స్టూడియో’.. తాజాగా కిశోర్ కుమార్ ‘మేరీ సప్నో కి రాణి’ పాట రీక్రియేషన్‌తో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.

ఈ బ్యాండ్ తమ లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఎవర్‌గ్రీన్ హిట్ ‘మేరీ సప్నో కి రాణి’ ఇన్‌స్ట్రుమెంటల్ వెర్షన్‌ను ప్రదర్శించి వాహ్ అనిపించారు. ఈ వీడియోకు సినిమాలోని ఒరిజినల్ సాంగ్‌‌కు సంబంధించిన కొన్ని ఐకానిక్ షాట్స్‌ కూడా యాడ్ చేయగా.. బాలీవుడ్ ఫ్యాన్స్‌ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ‘ఖాకీ స్టూడియో’ టాలెంట్, సాంగ్ సెలెక్షన్‌కు ఫిదా అయిన నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్‌తో హోరెత్తిస్తున్నారు. కాగా ‘మనీ హీస్ట్’ నుంచి పాపులర్ సాంగ్ ‘బెల్లా సియావో’తో తమ బ్యాండ్ మొదలుపెట్టిన ఖాకీలు.. నవరాత్రి సమయంలో గర్బా మ్యూజిక్ కూడా ప్లే చేశారు. మొత్తానికి దేశభక్తి గీతాలు, సినిమా పాటలతో పాటు పాపులర్ పాప్ సాంగ్స్‌‌కు కూడా ప్రొఫెషనల్స్ రేంజ్‌లో మ్యూజిక్ ప్లే చేస్తూ తమ టాలెంట్, స్కిల్స్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.


Next Story

Most Viewed