రోహిత్ సేన సూపర్ హిట్టు

by  |
రోహిత్ సేన సూపర్ హిట్టు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 17వ మ్యాచ్‌లో హైదరాబాద్‌ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 34 పరుగుల భారీ తేడాతో విజయకేతనం ఎగురవేసింది. బౌలర్లు సమష్ఠిగా రాణించడంతో హైదరాబాద్ బ్యాట్స్‌మెన్లు క్రీజులో నిలబడలేకపోయారు. దీంతో రైజర్స్ నిర్ధిష్ఠ 20 ఓవర్లలో 209 పరుగులు చేయాల్సి ఉండగా.. 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు మాత్రమే చేయగలిగింది.

సన్ రైజర్స్ ఇన్నింగ్స్:

209 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఆదిలోనే తడబడింది. ఓపెనర్ బెయిర్ స్టో క్రీజులో ఉన్న కాసేపు బ్యాటుకు పని చెప్పినా.. ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. 34 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టి 25 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు.

ఇక కెప్టెన్ డేవిడ్ వార్నర్ జట్టు భారాన్ని మోస్తూ చక్కటి బ్యాటింగ్‌తో ముందుకు సాగినా అతడికి సరైన భాగస్వామ్యం ఇచ్చే ఆటగాడు క్రీజులో నిలబడలేదు. వన్‌ డౌన్‌లో వచ్చిన మనీష్ పాండే 19 బంతుల్లో 30 పరుగులు చేశాడు. 94 స్కోర్ బోర్డు వద్ద జేమ్స్ ప్యాటిన్సన్‌ వేసిన బంతిని షాట్ ఆడబోయి పొలార్డ్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో రెండు కీలక వికెట్లను కోల్పోయిన హైదరాబాద్‌కు.. కేన్ విలియమ్సన్ ఆదుకుంటాడనుకుంటే కేవలం 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు.

అప్పటికే క్రీజులో ఉన్న డేవిడ్ వార్నర్ బాల్ టు బాల్ రన్ చేస్తూ తన ప్రయత్నాలను కొనసాగించాడు. ఆ తర్వాత వచ్చిన ప్రియమ్ గార్గ్ సైతం 7 పరుగులకే చేతులెత్తేశాడు. దీంతో 130 పరుగులకే సన్ రైజర్స్ 4 వికెట్లను కోల్పోయింది. ఇక హార్డ్ హిట్టర్‌లు ఎవరూ కూడా లేకపోవడంతో ఆ పని చేయబోయిన డేవిడ్ వార్నర్(60) సైతం క్యాచ్ అవుట్ అయ్యాడు. 44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.

ఆ తర్వాత వచ్చిన అబ్దుల్ సమద్(20), అభిషేక్ శర్మ (13) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. చివరి ఓవర్‌లో 37 పరుగులు చేయాల్సి ఉండగా.. రషీద్ ఖాన్(3) మాత్రమే చేసి నాటౌట్‌గా నిలిచినా ఓవర్లు ముగిసి పోయాయి. దీంతో నిర్ధిష్ఠ 20 ఓవర్లలో సన్ రైజర్స్ 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ముంబై ఇన్నింగ్స్:

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ భారీ స్కోరు నమోదు చేశారు. నిర్ధిష్ఠం 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరగులు చేశారు. ఓపెనర్ రోహిత్ శర్మ (6) పరుగులకే పెవిలియన్ చేరినా.. క్వింటెన్ డీకాక్ క్రీజులో నిలబడ్డాడు. కేవలం 39 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు బాది 67 పరుగులతో మంచి బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చి సూర్యకుమార్ యాదవ్(27) పర్వాలేదనిపించి.. 48 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు.

ఇక మిడిలార్డర్‌లో వచ్చిన బ్యాట్స్‌మెన్లు ఇషాన్ కిషన్(31) హార్దిక్ పాండ్యా(28) తమవంతు కృషి చేసి పెవిలియన్ చేరారు. కీరన్ పొలార్డ్ (25), కృనాల్ పాండ్యా (20) పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. దీంతో నిర్ధిష్ఠ 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 208 పరుగులు చేసింది.

Mumbai Indians Innings: రోహిత్ (c)c బెయిర్‌స్టో b సందీప్ శర్మ 6(5), డీకాక్ (wk)c and b రషీద్ ఖాన్ 67(39), సూర్యకుమార్ యాదవ్ c టీ నటరాజన్ b ఎస్ కౌల్ 27 (18), ఇషాన్ కిషన్ c మనీష్ పాండే b సందీప్ శర్మ 31(23), హార్దిక్ పాండ్యా b ఎస్ కౌల్ 28(19), పొలార్డ్ నాటౌట్ 25(13)
కృనాల్ పాండ్యా నాటౌట్ 20 (4) ఎక్స్‌ట్రాలు 4, మొత్తం స్కోరు: 208/5

వికెట్ల పతనం: 6-1 (రోహిత్, 0.5), 48-2 (సూర్య కుమార్ యాదవ్, 5.5), 126-3 (డీ కాక్, 13.1), 147-4 (ఇషాన్ కిషన్, 14.6), 188-5 (హార్దిక్ పాండ్యా, 19.2)

బౌలింగ్: సందీప్ శర్మ 4-0-41-2,టీ నటరాజన్ 4-0-29-0,ఎస్ కౌల్ 4-0-64-2, అబ్దుల్ సమాద్ 2-0-27-0, రషీద్ ఖాన్ 4-0-22-1, విలియమ్సన్ 2-0-24-0.

Sunrisers Hyderabad Innings: డేవిడ్ వార్నర్ (c)c ఇషాన్ కిషన్ b జేమ్స్ ప్యాటిన్సన్ 60(44), జానీ బెయిర్ స్టో (wk)c హార్దిక్ పాండ్యా b బోల్ట్ 25(15), మనీష్ పాండే c పొలార్డ్ b జేమ్స్ ప్యాటిన్సన్ 30(19), కేన్ విలియమ్సన్ c డీకాక్ b బోల్ట్ 3(5), ప్రియమ్ గార్గ్ c రాహుల్ చాహర్ b కృనాల్ పాండ్యా 8(7) అభిషేక్ శర్మ b బుమ్రా 10(13), అబ్దుల్ సమాద్ c రోహిత్ శర్మ b బుమ్రా 20(9),
రషీద్ ఖాన్ బ్యాటింగ్… ఎక్స్ ట్రాలు… మొత్తం స్కోరు…

వికెట్ల పతనం: 34-1 (జానీ బెయిర్ స్టో , 4.1), 94-2 (మనీష్ పాండే, 9.5), 116-3 (కేన్ విలియమ్సన్, 12.2), 130-4 (ప్రియమ్ గార్గ్, 14.1), 142-5 (డేవిడ్ వార్నర్, 15.4) 168-6 (అబ్దుల్ సమాద్, 18.2), 172-7 (అభిషేక్ శర్మ 18.5),

బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 4-0-28-2, జేమ్స్ ప్యాటిన్సన్ 4-0-29-2, కృనాల్ పాండ్యా 4-0-35-1,జస్ప్రీత్ బుమ్రా 4-0-41-2, కీరన్ పొలార్డ్ 3-0-20-0, రాహుల్ చాహర్ 1-0-16-0.

Next Story

Most Viewed