ముంబయి ఇండియన్స్‌కు కొత్త జెర్సీ

by  |
ముంబయి ఇండియన్స్‌కు కొత్త జెర్సీ
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్ కొత్త సీజన్ కోసం సిద్దమవుతున్నది. ఇప్పటికే అందుబాటులో ఉన్న క్రికెటర్లు చెన్నై చేరుకున్నారు. మొదటి విడత మ్యాచ్‌లు చెన్నైలో జరగనుండటంతో అక్కడే ప్రత్యేక క్యాంప్ ఏర్పాటు చేశారు. కాగా, శనివారం ముంబయి జట్టు కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఈ సీజన్‌లో సామ్‌సంగ్‌తో పాటు డీహెచ్ఎల్ కూడా స్పాన్సర్‌గా వ్యవహరిస్తుండటంతో ఆ లోగోలు ఇరు వైపుల ముద్రించారు. గతంలో భుజాల దగ్గర ఉండే గోల్డ్ కలర్ స్ట్రిప్‌ను తొలగించారు. ఈ సారి పంచభూతాలను థీమ్‌గా తీసుకొని జెర్సీని రూపొందించారు. అభిమానులు ఈ జెర్సీలు కొనుగోలు చేయాలనుకుంటే ది షోల్డర్ స్టోర్ అనే ఆన్‌లైన్ ప్లాట్ ఫామ్‌లో కొనుగోలు చేయవచ్చు. గతంలో జెర్సీ ఆవిష్కరణ వేడుకలను ముంబయి ఇండియన్స్ అట్టహాసంగా నిర్వహించేది. అయితే కోవిడ్ కారణంగా ఈ సారి కేవలం ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేసి ఆవిష్కరించింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed