దేశవాళీ క్రికెట్‌లో సంచలనం.. 4 బంతుల్లో లక్ష్య ఛేదన

by  |
దేశవాళీ క్రికెట్‌లో సంచలనం.. 4 బంతుల్లో లక్ష్య ఛేదన
X

దిశ, స్పోర్ట్స్: దేశవాళీ క్రికెట్‌లో సంచలనం నమోదయ్యింది. ముంబయి మహిళల జట్టు కేవలం 4 బంతుల్లో లక్ష్యాన్ని ఛేదించింది. అంతకు ముందు ప్రత్యర్థి నాగాలాండ్ జట్టును కేవలం 17 పరుగులకే ఆలౌట్ చేసింది. దేశవాళీ సీనియర్ మహిళల వన్డే ట్రోఫీలో భాగంగా హోల్కర్ స్టేడియంలో ముంబయి, నాగాలాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన నాగాలాండ్ జట్టు 17 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ముంబయి కెప్టెన్, పేసర్ సయాలీ సత్ఘరె 8.4 ఓవర్లలో 5 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీసింది. ఆమెతో పాటు దాక్షిణి 2 వికెట్లు, ఠాకూర్ ఒక వికెట్ తీయడంతో నాగాలాండ్ 17 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సరిబా 9 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక ముంబయి జట్టు ఓపెనర్లు ఇషా ఓజా, వృషాలీ కేవలం 4 బంతుల్లో లక్ష్యాన్ని ఛేదించారు. దీంతో ముంబయి 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

నాగాలాండ్ : 17 ఆలౌట్ (17.4 ఓవర్లు) ముంబయి : 20/0 (0.4 ఓవర్లు)

Next Story

Most Viewed