నా తల్లి ఆస్పత్రిలో ఉందన్నా డీసీపీ రక్షిత వినలేదు: సీతక్క

by  |
నా తల్లి ఆస్పత్రిలో ఉందన్నా డీసీపీ రక్షిత వినలేదు: సీతక్క
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: మల్కాజ్‌‌గిరి డీసీపీ రక్షితపై ములుగు ఎమ్మెల్యే సీతక్క ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో తన తల్లి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే బ్లడ్ అత్యవసరమైతే ములుగు నుంచి ఎమ్మెల్యే బంధువులు హైదరాబాద్‌కు వస్తుండగా.. మేడ్చల్ మల్కాజ్‌గిరి పరిధిలో డీసీపీ రక్షిత ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. బ్లడ్ డోనెట్ చేయడానికి వస్తున్న యువకుడి(సీతక్క బంధువు)ని రక్షిత మూర్తి అడ్డుకోవడంతో.. తన తల్లి ఐసీయూలో ఉన్నారని.. కావాలంటే ఎమ్మెల్యేతో మాట్లాడాలని సదరు యువకుడు కోరినప్పటికీ డీసీపీ వినలేదని సీతక్క ఆరోపించారు. డోంట్ టాక్ రబ్బిష్ అంటూ అరగంటకు పైగా నిలిపివేశారన్నారు. డీసీపీ రక్షిత అక్కడి నుంచి వెళ్లిన తర్వాత క్రింది స్థాయి ఉద్యోగి మానవత్వంతో ఆలోచించి సిటీలోకి వచ్చేందుకు అనుమతి ఇచ్చారని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. కాస్తాయిన మానవత్వంతో ఆలోచించని ఇటువంటి అధికారులు.. ఎమ్మెల్యేతోనే ఇలా ప్రవర్తిస్తే.. సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని సీతక్క ప్రశ్నించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story