ములుగు జిల్లాకే తలమానికంగా రామప్ప : రమాదేవి

by  |
Mulugu Revenue Officer Ramadevi
X

దిశ, ములుగు: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామప్ప దేవాలయం ములుగు జిల్లాకు తలమానికంగా మారిందని జిల్లా రెవెన్యూ అధికారిని రమాదేవి అన్నారు. బుధవారం ములుగు కలెక్టరేట్‌లో కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు డీఆర్‌ఓ రమాదేవి అధ్యక్షతన రామప్ప పర్యాటకుల అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ.. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం సంతోషమే అని, దీంతో రామప్ప చుట్టు పక్కల ప్రాంతాలు అభివృద్ధి చెంది, ములుగు జిల్లాకు తలమానికంగా మారాయన్నారు. రామప్ప ఆలయ అభివృద్ధి పనులకు దిశా నిర్దేశం చేయడం మూలంగా ములుగు జిల్లా, రామప్ప పరిసర గిరిజన ప్రాంతాల యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయనే ఉద్దేశంతోనే సంబంధిత శాఖలతో సమీక్ష నిర్వహించామని తెలిపారు.

రామవ్పకు యునెస్కో గుర్తింపు వచ్చిన సందర్భంగా నూతన ప్రతిపాదిత పసులు:

రామప్ప వద్ద టూరిజం విలేజ్(గ్రామీణ పర్యాటకం) కోసం స్థల పరిశీలన, రామప్ప సరస్సు బండ్ మరియు పరిసర ప్రాంతంలో బృందావన్ గార్డెన్‌ ఏర్పాటు. రామప్ప సరస్సు బండ్ పరిసరాల్లో జింకల పార్కు కోసం ఏర్పాటు. పాలంపేట గ్రామ సమీపంలో హెలీప్యాడ్ ఏర్పాటు. రామప్పకు వచ్చే పర్యాటకుల కోసం రహదారి విస్తరణ. విద్యుత్ దీపాల అలంకరణ. ఆలయ పరిసరాల్లో ఉన్న ఉప ఆలయాలు. ఇతర ఆలయాల పునరుద్దరణ. రామప్ప నుండి 25 కి.మీ. దూరంలో ఉన్న దేవునిగుట్టతో పాటు జిల్లాలో పర్యాటక క్షేత్రాలైన వివిధ ప్రదేశాల అభివృద్ధి. రామప్ప చెరువులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వాటర్ స్పోర్ట్స్ నిర్వాహణ. రామప్ప చెరువు కట్ల ముందు రోప్‌వే ఏర్పాటు. జాతీయ స్థాయిలో పేరిణి నృత్య కళాశాల, జాతీయ శిల్ప కళాశాల ఏర్పాటు. ఆలయ పరిసరాల్లో ఎకో ఫ్రెండ్లీ వాహనాలు (బ్యాటరీ వాహనాలు) ఏర్పాటు. ఆలయ పరిసర ప్రాంతాల్లో థీమ్ పార్క్/ఓపెన్ ఏయిర్ థియేటర్ నిర్మాణం. స్టార్ కేటగిరీ హోటల్స్ నిర్మాణం. నిరంతరం అందుబాటులో ఉండేలా పర్యాటక సమాచార కేంద్రం ఏర్పాటు. అదనపు గైడ్లను ఏర్పాటు. రాష్ట్రస్థాయిలో, వివిధ జిల్లాల నుండి పర్యాటకుల సౌకర్యార్థం ప్రత్యేక కార్టేజీల ఏర్పాటుతో పాటు వివిధ పనుల నిమిత్తం స్థల పరిశీలన కోసం ఈ సమీక్ష సమావేశం నిర్వహించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నాగపద్మజ, జిల్లా టూరిజం అధికారి శివాజీ, ఏకాంబరం, ఎంపీడీవో ఇక్బాల్ హుస్సేన్, ములుగు సీఐ శ్రీధర్, వెంకటాపూర్ ఎస్ఐ రమేష్, సర్వేయర్ సుచిత్ర తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed