ధోని నిజస్వరూపం బయటపెట్టిన జై షా.. వరల్డ్ కప్‌ ముంగిట ఊహించని ప్రకటన

by  |
ధోని నిజస్వరూపం బయటపెట్టిన జై షా.. వరల్డ్ కప్‌ ముంగిట ఊహించని ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌ను వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయినా.. ధోని సేవలు టీ20 వరల్డ్‌ కప్‌ కోసం టీమిండియాకు ఎంతో అవసరమని బీసీసీఐ గుర్తించి జట్టుకు మెంటార్‌గా నియమించింది. ఈ వ్యవహారంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ.. బీసీసీఐ మాత్రం తన నిర్ణయాన్ని విరమించుకోలేదు. జట్టు లాభం కోసమే ధోనిని ఎంపిక చేసినట్టు చెప్పుకొచ్చారు.

కానీ, దీనిపై ఎంఎస్ ధోని సైలెంట్‌గానే ఉన్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2021 సీజన్‌ క్లైమాక్స్‌కు చేరుకోవడంతో.. క్రికెట్ అభిమానుల చూపు పొట్టి ప్రపంచ కప్‌పై పడింది. ఇదే సమయంలో బీసీసీఐ సెక్రటరీ జై షా ధోని గురించి ఓ విషయాన్ని చెప్పారు. టీ-20 సిరీస్‌లో టీమిండియా జట్టుకు మెంటార్‌గా ఉంటున్న ధోని ఎలాంటి గౌరవ వేతనం తీసుకోవడం లేదని ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయం తెలుసుకున్న ధోని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లు దుబాయ్‌ వేదికగా అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్నాయి.

Next Story