షాహిద్‌ను చెంపదెబ్బకొట్టిన నటి.. తర్వాత భయంగా ఉందంటూ.. 

by  |
షాహిద్‌ను చెంపదెబ్బకొట్టిన నటి.. తర్వాత భయంగా ఉందంటూ.. 
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ సుదీర్ఘ విరామం తర్వాత ‘జెర్సీ’ మూవీతో సందడి చేయనున్నాడు. షాహిద్‌తో పాటు మృణాల్ ఠాకూర్, పంకజ్ కపూర్ ప్రధాన పాత్రల్లో స్పోర్ట్స్ డ్రామా‌గా తెరకెక్కిన ఈ మూవీ తెలుగు రీమేక్ అని తెలిసిందే. ఇక ఈ చిత్రంలో షాహిద్-మృణాల్ మధ్యన కెమిస్ట్రీ బాగా పండిందని మూవీ యూనిట్ ప్రకటించగా.. సినిమాలోని ఓ సన్నివేశం గురించి మృణాల్ ఆసక్తికర విషయాన్ని బయట పెట్టింది. హీరోను చెంప దెబ్బ కొట్టే సీన్ గురించి చెబుతూ.. ‘షాహిద్‌ను కొట్టేముందు నేను చాలా టెన్షన్ పడ్డాను. కానీ తను మాత్రం నన్ను ఎంకరేజ్ చేశాడు. నాలో ధైర్యాన్ని నింపుతూ.. ఏం పర్వాలేదు ‘మార్ ముఝే మార్’ అంటూ సపోర్ట్ చేశాడు’ అని తెలిపింది. అయితే ఈ సీన్ చూసిన తర్వాత షాహిద్ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారోనని మళ్లీ భయం వెంటాడుతోందని చెప్పింది. గౌతమ్ తన్నూరి దర్శకత్వం వహించిన సినిమా ఈ నెల 31న విడుదల కానుంది.

ఆ హీరోకు కండోమ్ గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నా.. దీపిక


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed