మా వంతెన తరలిపోతోంది.. ఆపండి సారూ..

by  |
మా వంతెన తరలిపోతోంది.. ఆపండి సారూ..
X

దిశ, ఏపీ బ్యూరో : పి. గన్నవరం మండలం ఊడిమూడిలంక వద్ద వైనతేయ నది పైన మంజూరు అయిన వంతెనను వేరే ప్రాంతానికి తరలించడానికి ప్రయత్నిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వల ప్రకారమే వంతెన నిర్మాణం చేపట్టాలని ఎంపీటీసీ ప్రియదర్శిని కోరారు. అలాగే కలెక్టర్ సి. హరికిరణ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.

2018 నవంబర్ 22 న ప్రభుత్వం 49.50 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ వంతెన మరో ప్రాంతంలో చేపట్టాలని కొందరు రాజకీయ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలని కోరారు.

Next Story

Most Viewed