సీఎం కేజ్రీవాల్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఆస్పత్రిలో చేరిన ఎంపీ మనోజ్ తివారీ

by  |
సీఎం కేజ్రీవాల్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఆస్పత్రిలో చేరిన ఎంపీ మనోజ్ తివారీ
X

దిశ, వెబ్‌డెస్క్ : హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఛత్ పూజపై ఢిల్లీ సర్కార్ మరోసారి నిషేధం విధించింది. దేశరాజధాని శివార్ల నుంచి భక్తులెవరూ ఛత్ పూజ కోసం రాకూడదని అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఢిల్లీలో కొవిడ్ కేసులు ఇంకా తగ్గుముఖం పట్టని కారణంగా మరోసారి ఈ పూజపై బ్యాన్ విధించినట్టు ఆప్ ప్రభుత్వం ప్రకటించింది. కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయంపై బీజేపీ పార్టీ భగ్గుమన్నది. ఆయన నివాసం ఎదుట బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ నేతృత్వంలో కార్యకర్తలు ఆందోళన చేపట్టగా పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

నిరసనకారులు ఎంతకూ వినకపోయేసరికి వాటర్ కెనాన్స్ ద్వారా నిరసనకారులను చెదరగొట్టారు. ఈ ఘటనలో ఎంపీ మనోజ్ తివారీకి గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆయన్ను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. వాటర్ ఫిరంగిని ప్రయోగించిన సమయంలో మనోజ్ తివారీ బారికేడ్ మీద నిలబడి ఉండటంతో ఈ ప్రమాదం జరిగిందని బీజేపీ ఢిల్లీ అధికార ప్రతినిధి అభయ్ వర్మ తెలిపారు. కాగా, ఛత్‌‌పూజను కరోనా వ్యాప్తి చెందకుండా గతంలోనూ కేజ్రీ ప్రభుత్వం నిషేధించింది. కారణం మహిళా భక్తులు పెద్దసంఖ్యలో నీటిలో దిగి గుంపులుగుంపులుగా పూజలు చేయడం వలన నీటిలో వైరస్ కారకాలు ఉంటే కొవిడ్ వ్యాప్తి జరుగుతుందని భావించి ముందస్తుగా నిషేధం విధించారు.

Next Story