'స్ట్రీట్ సైడ్ ఫెలో’.. మోదీపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు

by  |
స్ట్రీట్ సైడ్ ఫెలో’..  మోదీపై  ఎంపీ సంచలన వ్యాఖ్యలు
X

కోల్‌కతా : ప్రధాని నరేంద్ర మోడీపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా సంచలన కామెంట్స్ చేశారు. ఆయనను ‘స్ట్రీట్ సైడ్ ఫెలో’ (వీధుల్లో తిరిగే ఆవారా) అంటూ వ్యాఖ్యానించారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మోడీ చేసిన వ్యాఖ్యలకు గాను మహువా స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉల్బేరియాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో దీదీని ఉద్దేశిస్తూ… ‘దీదీ.. ఓ దీదీ’ అంటూ మోడీ సంబోధించారు. ఈ వ్యాఖ్యలపై టీఎంసీ నాయకులు మండిపడుతున్నారు.

ఇదే విషయమై మహువా స్పందిస్తూ.. లక్షలాది మంది సమక్షంలో ఒక ప్రధాని స్థాయి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిని అలా పిలవొచ్చా..? అని ప్రశ్నించారు. ‘మీ అమ్మనో, సోదరినో అలా పిలుస్తారా..? అది ఎంతవరకు సమంజసం..?’ అని మండిపడ్డారు. ఇంకా ఆమె వివరిస్తూ.. ‘‘బెంగాల్‌లో ఒక సామెత ఉంది. ‘rock-er chhele’. దాని అర్థం స్ట్రీట్ సైడ్ ఫెలో. ఇతడు వీధుల్లో పిట్టగోడల మీద కూర్చుని రోడ్డుపై వచ్చే పోయే మహిళలను చూసి దీదీ.. ఏయ్ దీదీ.. అంటూ వారిని పిలుస్తూ కేకలేస్తాడు. ప్రధానమంత్రి వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక దీదీ మరో స్థానం నుంచి పోటీ చేస్తున్నారనే మోడీ ఆరోపణలపైనా మహువా కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా.. ‘అవును ప్రధాని గారు. ఆమె (దీదీ) పోటీ చేస్తుంది. ఆ స్థానం మరేదో కాదు. వారణాసి. అక్కడికి వెళ్లి మీ అస్త్రాలు సిద్ధం చేసుకోండి’ అంటూ ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed