కరోనా మందులపై జీఎస్టీ తగ్గించడం హర్షనీయం

by  |
bandi-sanjay bjp cheif
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం కొవిడ్ మెడిసిన్లపై ఉన్న జీఎస్టీని తగ్గించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. జీఎస్టీ కౌన్సిల్‌లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంపై ప్రధాని మోడీ, ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ముఖ్య అధికారులతో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 44 వ సమావేశంలో కొవిడ్ -19 తో పాటు బ్లాక్ ఫంగన్ చికిత్సకు ఉపయోగించే రెండు రకాల మందులకు జీఎస్టీ రద్దు చేసినట్లు ఆయన తెలిపారు.

కరోనా ఔషధాలు, పరికరాలు, మందులపై మినహాయింపులు ఇచ్చినట్లు చెప్పారు. 12 శాతం నుంచి 5 శాతానికి జీఎస్టీ తగ్గించారని బండి పేర్కొన్నారు. రెమిడిసివర్ ఇంజెక్షన్ పై ఉన్న 12 శాతం పన్నును 5 శాతానికి తగ్గించారన్నారు. శానిటైజర్లు, టెంపరేచర్ చెకింగ్ పరికరాలు, శ్మశానవాటికల్లో ఉండే గ్యాస్ ఎలక్ట్రిక్ సామగ్రిపై గతంలో 18 శాతం జీఎస్టీ ఉండేదని ఈ సమావేశంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి వాటిని 5 శాతానికి తగ్గించినట్లు బండి సంజయ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా అంబులెన్స్ ల రవాణాకు సంబంధించి జీఎస్టీని సైతం తగ్గించినట్లు చెప్పారు.



Next Story

Most Viewed