ఇకపై నో రిక్వెస్ట్.. ఓన్లీ వార్నింగే : బండి సంజయ్

80

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇక నుంచి రెక్వెస్టులు చేయబోమని, ప్రజా సమస్యలను పరిష్కరించకుంటే డైరెక్ట్‌గా వార్నింగ్‌లే ఇస్తామని బీజేపీ చీఫ్ బండి సంజయ్ హెచ్చరించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బుధవారం జీహెచ్‌ఎంసీ బీజేపీ కార్పొరేటర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని, సీఎంగా ఉండేందుకు ఆయనకు ఆసక్తి లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నాడని, ఇక జైల్‌కు వెళ్లకుండా చూసుకోవడమేలా అనే విషయంపైనే ఆయన దృష్టి ఉందని ఆరోపించారు.

అందుకే ప్రజా సమస్యలను గాలికొదిలేసి, ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్న సీఎం ఫామ్‌హౌజ్‌ను త్వరలోనే ముట్టడిస్తామన్నారు. తెలంగాణ ప్రజలకు సీఎం, మంత్రులు అబద్ధాలు చెబుతూనే ఉన్నారని, దుబ్బాక బై ఎలక్షన్స్‌లో పబ్లిక్ బుద్ధి చెప్పిన కేసీఆర్‌ మారలేదన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచంద్ర రావు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని, అందుకోసం కార్పొరేటర్లు క్షేత్ర స్థాయిలో క్యాడర్‌ను సమన్వయం చేసుకుంటూ పని చేయాలని సూచించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..