ప్రధాని చైనా గురించి మాట్లాడకుండా "చనా" మాట్లాడారు : అసదుద్దీన్‌ ఓవైసీ

by  |
ప్రధాని చైనా గురించి మాట్లాడకుండా చనా మాట్లాడారు : అసదుద్దీన్‌ ఓవైసీ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. అయితే ప్రస్తుతం చైనా-భారత్ ల మధ్య వివాదం కొనసాగుతున్నప్పటికీ మోడీ తన ప్రసంగంలో చైనా గురించి ప్రస్తావించలేదు. ఈ విషయంపై ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ విస్మయం వ్యక్తం చేశారు. ప్రధాని తన ప్రసంగంలో చైనా గురించి మాట్లాడుతారనుకుంటే చనా (పప్పుధాన్యాలు)పై మాట్లాడుతూ తన ప్రసంగాన్ని ముగించారంటూ ఎద్దేవా చేసారు. అంతేకాకుండా ముస్లింలు పవిత్రంగా జరుపుకునే ఈద్‌ గురించి సైతం ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించలేదని అన్నారు. రానున్న నెలల్లో వచ్చే పలు పండుగల గురించి మాట్లాడిన ప్రధాని మోదీ ఈద్‌ గురించి మాత్రం చెప్పనేలేదని ట్వీట్‌‌లో పేర్కొన్నారు.

Next Story