'కేసీఆర్ భాషకు సెన్సార్ బోర్డు ‘18 ప్లస్’ రేటింగ్'

by  |
కేసీఆర్ భాషకు సెన్సార్ బోర్డు ‘18 ప్లస్’ రేటింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ ప్రెస్‌మీట్లలో వాడుతున్న భాష యావత్తు తెలుగు సమాజం తలదించుకునేలా ఉన్నదని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రులను అవమానించేలా ఆయన మాట్లాడిన మాటలు, భాష దుబాయి శేఖర్ లాగా ఉందన్నారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ భాషకు సెన్సార్ బోర్డు ‘18 ప్లస్’ రేటింగ్ ఇవ్వాలన్నారు. మీడియా సమావేశాల్లో ఆయన మాట్లాడే మాటలు అడల్ట్ సినిమాల్లో వాడే భాషలాగా ఉన్నదన్నారు. ముఖ్యమంత్రి తన స్థాయికి దిగజారి బీజేపీ ఎంపీలపై పదజాలాన్ని వాడుతున్నారని అన్నారు. స్వయంగా తప్పులు చేస్తూ నెపాన్ని కేంద్రం మీదకు నెడుతున్నారని, వాస్తవాలను తెలుసుకోకుండా ఎవరో ఇచ్చిన సమాచారాన్ని మీడియా సమావేశంలో ఏకరువు పెడుతున్నారని ఆరోపించారు.

సీఎం కేసీఆర్, ఆయన కొడుకు మంత్రి కేటీఆర్ స్మగ్లర్లుగా మారారని ఆరోపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి ముసుగులో ఉన్న ఒక స్మగ్లర్ అని, తెలంగాణలో పండే నాణ్యమైన బియ్యాన్ని ప్రైవేటుగా రైస్ మిల్లర్లకు అమ్ముతూ డబ్బులు సంపాదిస్తున్నారని అన్నారు. కేటీఆర్ సైతం అదే అవతారం ఎత్తారని, ఆయన అనచరులుగా ఉన్న టీఆర్ఎస్ నేతలు రీసైకిల్ చేసిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అమ్ముతున్నారని, కర్నాటక నుంచి తక్కువ నాణ్యత ఉన్న బియ్యాన్ని తెచ్చుకుని స్మగ్లింగ్‌కు పాల్పడుతూ వేల కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ అండదండలతో మిల్లర్లు ఎక్కువ తరుగు తీసి రైతులకు అన్యాయం చేస్తూ అక్రమంగా సంపదను పోగుచేసుకుంటున్నారని అన్నారు.

వడ్ల సమస్యతో దళితబంధు డైవర్ట్

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా దళితబంధు పథకాన్ని తెరపైకి తెచ్చిన కేసీఆర్ నవంబరు 4వ తేదీ నుంచి స్వయంగా అమలు చేస్తానని హామీ ఇచ్చారని, కానీ అక్కడ ఓడిపోవడంతో దాని ప్రస్తావనే లేదని అరవింద్ ఆరోపించారు. ఆ అంశంపై విపక్షాలు, ప్రజలు, లబ్ధిదారులు ప్రశ్నించకుండా ఉండేందుకే దృష్టిని మళ్ళించడానికి వడ్ల కొనుగోలు అంశాన్ని తెరపైకి తెచ్చారని అన్నారు. ఎదురుదాడి చేయడం కోసమే దళితబంధు నుంచి అటెన్షన్ డైవర్ట్ చేశారన్నారు. వడ్ల కొనుగోళ్ళలో ఆయన బండారం బయటపడిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడానికి కొత్త విద్యుత్ చట్టాన్ని కేంద్రం తీసుకొస్తున్నదంటూ రైతుల్ని కన్ఫ్యూజన్‌లోకి నెడుతున్నారని అన్నారు. కానీ కొత్త విద్యుత్ చట్టంలో మోటార్లకు మీటర్ల ప్రస్తావనే లేదన్నారు.


Next Story

Most Viewed