అది కూడా నల్లగా ఉంటుందా అంటూ చండాలంగా మాట్లాడారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by Kavitha |
అది కూడా నల్లగా ఉంటుందా అంటూ చండాలంగా మాట్లాడారు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం. కానీ తెరమీద కనిపించినంత అందంగా నటినటుల జీవితాలు మాత్రం ఉండవు. ఎందుకంటే అవకాశాలను దక్కించుకోవడం కోసం తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా మహిళ నటినటులకు, హీరోయిన్స్‌ అడుగడుగున్న ఇబ్బువులు ఎదురుకుంటారు. ఇక వారు ఒక మంచి పొజిషన్ కు వచ్చిన తర్వాత.. కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి పంచుకుంటారు. అది కూడా కొంత మంది మాత్రమే ధైర్యంగా చెప్పుకుంటారు.

అయితే తాజాగా ‘షరతులు వర్తిస్తాయి’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్న హీరోయిన్ భూమి శెట్టి. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ నా శరీర రంగు విషయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. రంగుపై ఇతరులు మాటలతో ఎంతగానో ఇబ్బంది పెట్టారు. ఎవరు పెళ్లి చేసుకుంటారు. ఏమైనా క్రీమ్స్ వాడు అంటూ అందరూ వెక్కిరించేవారు. ఇప్పటికి ఇంస్టాగ్రామ్ లో నల్లగా ఉన్నావ్ అంటూ కామెంట్లు పెడుతూనే ఉంటారు. కానీ వాటిని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నా అందం ఏంటో నాకు తెలుసు’ అంటూ చెప్పుకొచ్చింది భూమిశెట్టి.

Read More..

హ్యాపీ బర్త్‌డే బామ్మర్ది.. అనుపమ పోస్ట్‌పై నెటిజన్ల రియాక్షన్ మామూలుగా లేదుగా

Next Story

Most Viewed