- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ పార్ట్‌కి సర్జరీ చేయించానని లైవ్‌లోనే ఒప్పేసుకున్న యంగ్ హీరోయిన్

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల గురించి పరిచయం అక్కర లేదు. ‘మల్లేశం’ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనన్య.. ‘వకీల్ సాబ్’లో తన నటనతో అందరిని ఆకట్టుకుంది. తర్వాత ‘మాస్ట్రో, ఊర్వశివో రాక్షశివో, శాకుంతలం, మళ్లీ పెళ్లి, అన్వేషి’ వంటి మూవీస్‌తో అలరించిన ఈ అమ్మడు ప్రస్తుతం ‘తంత్ర’ చిత్రంతో బిజీగా ఉంది.
అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తు్న్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పోస్టర్స్ ఎంతగానో ఆకట్టుకోగా.. సినిమాపై భారీ అంచనాలు పెట్టకున్నారు ప్రేక్షకులు. ఇక రిలీజ్ సమయం కూడా దగ్గర పడటంతో వరుస ప్రమోషన్స్‌లో బిజీగా ఉంటున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే అనన్య నాగళ్ల సినిమా విశేషాలతో పాటు.. పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంది.
ఇండస్ట్రీలో చాలా మంది తమ గ్లామర్‌ను కాపాడుకోడానికి సర్జరీలు చేయించుకుంటున్నారు. మీరెప్పుడైనా ఎలాంటి సర్జరీ అయిన చేయించుకున్నారా అనే ప్రశ్నకు.. అనన్య బదులిస్తూ ‘అవును చేయించుకున్నాను. లిప్ షేప్ కోసం నేను లిప్ ఫిల్లర్ వేయించాను. అది వేసి రెండేళ్లు అవువతోంది. ఇప్పుడు పోయినట్టుంది’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనన్య వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.