- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రామ్ చరణ్ తల్లి పాత్రలో యంగ్ బ్యూటీ.. అప్పుడేనా!

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ అంజలి ‘ఫొటో’ చిత్రంతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా, గీతాంజలి’ లాంటి మూవీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. 2014 లో వచ్చిన కామెడీ అండ్ హార్రర్ చిత్రం ‘గీతాంజలి’ కి సీక్వెల్‌గా తెరకెక్కబోతోంది. శివతుర్లపాటి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా నుంచి టీజర్ ఈ శనివారం రాత్రి 7 గంటలకు రానున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు మేకర్స్. ఇదిలా ఉంటే.. అంజలి అప్పుడే తల్లి క్యారెక్టర్‌లో కనిపిస్తుందంటూ నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా సినిమా ‘గేమ్ ఛేంజర్’. జీనియస్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వాణి హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఇందులో ఎస్.జె సూర్య, సునీల్, జయరామ్, నవీన్ చంద్ర, నాజర్, రాజీవ్ కనకాలతో పాటు అంజలి కూడా ప్రధాన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. అయితే.. అజంలి క్యారెక్టర్‌పై ఓ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ మూవీలో రామ్ చరణ్ రెండు పాత్రలు పోషిస్తుండగా.. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే ఫాదర్ రోల్‌కి అంజలి జోడిగా కనిపించనుందట. అంటే.. మూవీలో ప్రస్తుత రామ్ చరణ్‌కు తల్లి అన్న మాట. ఈ వార్త నెట్టింట వైరల్ కావడంతో అప్పడే తల్లి పాత్రలు చేసేస్తున్నావా అంటూ నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు.