అసిస్టెంట్ ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్ ఇచ్చిన యష్.. (వీడియో)

by Kavitha |   ( Updated:2024-02-19 05:55:59.0  )
అసిస్టెంట్ ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్ ఇచ్చిన యష్.. (వీడియో)
X

దిశ, సినిమా: మూవీ షూటింగ్ లలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ. కొంత మంది సెలబ్రెటీలు మాత్రం, వారి చుట్టూ ఉంటూ వారి కోసం పనిచేసే వారి పై ఎంతో ప్రేమగా ఉంటారు. ఎలాంటి కష్టం వచ్చిన ఆదకుంటారు. వారికి వస్తువులు కానుకగా ఇచ్చి సడెన్ సర్‌ప్రైజ్ లు ఇస్తూ ఉంటారు. కాగా తాజాగా కన్నడ హీరో యష్ కూడా అలాంటి పనే చేశారు. రీసెంట్ గా తన అసిస్టెంట్ ఇంటికి వెళ్లి షాక్ ఇచ్చాడు.

యష్ వద్ద చేతన్ అనే వ్యాక్తి దాదాపు 12 ఏళ్లుగా అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడట. చెప్పాలంటే మన హీరో సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి అన్నమాట. దీని బట్టి వీరిద్దరి మధ్య బంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇందులో భాగంగా తాజాగా చేతన్ దంపతులకు కొన్ని రోజుల క్రితం బాబు పుట్టాడు. అయితే తన ‘టాక్సిక్’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉండటంతో.. వెళ్లలేకపోయాడు యశ్. కానీ తాజాగా సడెన్ గా ఇంటికి వెళ్లి.. వారి కొడుక్కి బంగారు గొలుసును కానుకగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక అలాగే గతంలో రష్మిక కూడా ఇలాగే చేసింది. తన అసిస్టెంట్ పెళ్లికి వెళ్లి గుర్తుండిపోయేలా సర్‌ప్రైజ్ ఇచ్చింది. అభిమానుల బాధలు మాత్రమే కాదు వారి ఆనందంలో కూడా పాలు పంచుకుంటున్నారు సెలబ్రేటిలు.

Next Story