చాలా డిఫరెంట్‌గా యశ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ టైటిల్.. ‘కేజీఎఫ్ 2’ రికార్డ్స్ బ్రేక్ అవుతాయా?

by Disha Web Desk 7 |
చాలా డిఫరెంట్‌గా యశ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ టైటిల్.. ‘కేజీఎఫ్ 2’ రికార్డ్స్ బ్రేక్ అవుతాయా?
X

దిశ, సినిమా : ‘కేజీఎఫ్’ సక్సెస్‌తో ఇంటర్నేషనల్ గుర్తింపు సంపాదించిన హీరో యశ్.. ‘కేజీఎఫ్ 2’ రిలీజ్ తర్వాత మరో సినిమా ప్రకటించేందుకు చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఎప్పుడు అడిగినా సరైన కంటెంట్ కోసం ఎదురుచూస్తున్నానని.. అభిమానులు, ప్రేక్షకులు మెచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఎట్టకేలకు నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రకటించేశాడు. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ‘TOXIC’గా రాబోతున్నాడు.

‘A Fairy Tale For Grown-ups’ అనేది క్యాప్షన్‌ కాగా ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్, మాస్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చేతిలో గన్, నోట్లో సిగరెట్, తలపై హ్యాట్‌తో యశ్ సూపర్ స్టైలిష్‌గా కనిపించగా.. 2025, ఏప్రిల్ 10న మూవీని రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక దీనిపై స్పందిస్తున్న అభిమానులు.. మరో ఇండస్ట్రీ హిట్ లోడింగ్ అని కామెంట్స్ చేస్తున్నారు. ‘కేజీఎఫ్ 2’ రికార్డ్స్ బ్రేక్ చేయాలని కోరుకుంటున్నారు.Next Story

Most Viewed