ఆ కోరికలు ఉన్నవారు ఇండస్ట్రీలో ఎక్కువకాలం నిలబడలేరు.. Yami Gautam Dhar

by Disha Web Desk 10 |
ఆ కోరికలు ఉన్నవారు ఇండస్ట్రీలో ఎక్కువకాలం నిలబడలేరు.. Yami Gautam Dhar
X

దిశ, సినిమా: ఈ తరం నటీనటులు మార్కెట్ కల్చర్‌పై ఆధారపడి తమ సొంత టాలెంట్‌ను కిల్ చేసుకుంటున్నారని చెప్తోంది నటి యామీ గౌతమ్. ఇటీవల విడుదలైన ‘ఓ మై గాడ్‌-2’ చిత్రంలో ఆమె పోషించిన లాయర్‌ పాత్రకు ప్రశంసలు దక్కుతుండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ‘మార్కెటింగ్‌ కల్చర్‌ మంచిది కాదు. కథల మీద దృష్టిపెట్టకుండా సినిమా మార్కెటింగ్‌కు ప్రాధాన్యతనిస్తే ప్రతిభ మరుగున పడిపోతుంది. కొందరు ఓవర్‌నైట్‌లో సక్సెస్‌ సాధిస్తే మరికొందరు ఏళ్ల తరబడి కష్టపడతారు. వీరందరికంటే భిన్నంగా కేవలం మార్కెటింగ్‌ను నమ్ముకొని విజయాలు సాధించాలని ఇంకొందరు కోరుకుంటారు. అలాంటివారు ఇండస్ట్రీలో ఎక్కువకాలం ఉండలేరు. ఇటీవల వైవిధ్యమైన కథలు, పాత్రలపై దృష్టిపెట్టకుండా తొరగా పాపులర్‌ అయిపోదామనే ధోరణి బాగా పెరిగిపోయింది’ అంటూ చెప్పుకొచ్చింది. చివరగా తానుమాత్రం మార్కెటింగ్‌ సంస్కృతికి దూరంగా ఉంటానని, టాలెంట్‌ను నమ్ముకొని కష్టపడి పని చేస్తేనే సక్సెస్‌ వస్తుందని నమ్ముతానని చెప్పింది.

Read More: గుప్పెడంత మనస్సు ఆగస్ట్ 14 ఎపిసోడ్ : రిషి, వసుధారను కలిపిన విశ్వనాధం

ప్లీజ్ మా ఇమేజ్ డ్యామేజ్ చేయొద్దు.. నేహతో రొమాన్స్‌పై స్పందించిన హీరో


Next Story

Most Viewed