కెరీర్ ఒడిదొడుకులే నన్ను బలంగా నిలబెట్టాయి : Yami Gautam

by Disha Web |
కెరీర్ ఒడిదొడుకులే నన్ను బలంగా నిలబెట్టాయి : Yami Gautam
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ యాక్ట్రెస్ యామీ గౌతమ్ తన కెరీర్ స్ట్రగుల్స్‌పై ఎమోషనల్‌గా స్పందించింది. ఆమె నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'లాస్ట్' ఇటీవలే గోవా 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2022(IFFI)'లో ప్రీమియర్ చేయబడింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నటి.. ఈ వేదికపై తన సినిమాను ప్రదర్శించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది. 'నా ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. కెరీర్‌లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటకీ అవన్నీ విలువైనవే. నిజానికి నా మొదటి సినిమా విజయం సాధించినప్పటికీ నేను ఓడిపోయాను. ఎందుకంటే ఆ తర్వాత ఎటువైపు వెళ్లాలో తెలియలేదు. అప్పట్లో నేను అందుకుంటున్న అవకాశాలతో కనెక్ట్ కాలేకపోయా. పనిలేకుండా ఉంటానా? అవకాశాలను అందిపుచ్చుకుని ఇంకా ప్రయత్నిస్తానా? అనే ఆలోచనలన్నీ నా మదిలో మెదులుతుండేవి. నా స్వస్థలం వదిలి వెళ్లడం వల్ల నా ఉద్దేశ్యం ఏమిటో పూర్తిగా అర్థం చేసుకుని నన్ను నేను తిరిగి కనుగొన్నాను' అంటూ చెప్పుకొచ్చింది.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed