యూఎస్‌లో 'రైటర్ పద్మభూషణ్' భారీ కలెక్షన్స్!

by Disha Web Desk 10 |
యూఎస్‌లో రైటర్ పద్మభూషణ్ భారీ కలెక్షన్స్!
X

దిశ, సినిమా: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ నటించిన తాజా చిత్రం 'రైటర్ పద్మభూషణ్'. షణ్ముఖ ప్రశాంత్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్‌లో కూడా సాలిడ్‌గా రన్ అవుతుంది. ఇప్పటివరకూ అక్కడ లేటెస్ట్‌గా రూ.2 లక్షల డాలర్స్ మార్క్‌ని కూడా క్రాస్ చేసినట్లు సమాచారం. అయితే తాజాగా ఈ చిత్రం వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ''రైటర్ పద్మభూషణ్' చూసి ఆనందించాను. హృదయాలను హత్తుకునే చిత్రం, ముఖ్యంగా క్లైమాక్స్ చాలా బాగుంది. తప్పనిసరిగా ఫ్యామిలీ చూడాల్సిన సినిమా. సుహాస్ నటన చాలా బాగుంది' అంటూ ట్వీట్ చేశాడు.


Next Story

Most Viewed