నాలుగో బిడ్డకు జన్మనిచ్చిన వండర్ వుమెన్.. గాల్ గాడోట్

by Kavitha |
నాలుగో బిడ్డకు జన్మనిచ్చిన వండర్ వుమెన్.. గాల్ గాడోట్
X

దిశ, సినిమా: హాలీవుడ్‌లో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌కు ఎంత ఫ్యాన్స్ ఉన్నారో.. డీసీకి కూడా అంతే ఫ్యాన్స్ ఉన్నారు.అలా డిస్నీ సినిమాటిక్ యూనివర్స్ నుంచి సూపర్ హీరో మూవీస్‌గా వచ్చిన ఫ్రాంఛైజీలో ‘వండర్ వుమెన్’ ఒకటి. 2017లో వచ్చిన ఈ మూవీ ద్వారా హాలీవుడ్‌తోపాటు యావత్ ప్రపంచానికి వండర్ వుమెన్‌గా మారిపోయింది నటి గాల్ గాడోట్. తన నటన, గ్లామర్, యాక్షన్ సీక్వెన్స్‌తో అదరగొట్టింది. ఇక తాజాగా తన నాలుగో కుమార్తెకు జన్మనిచ్చింది గాల్ గాడోట్. సోషల్ మీడియాలో తన పాప ఫొటోను షేర్ చేస్తూ ఈ విషయం ప్రకటించడంతో అభిమానులు, ప్రేక్షకులు షాక్ అయ్యారు. తాను మళ్లీ ప్రెగ్నెంట్ అయిన విషయం పెద్దగా తెలియదు. ఇప్పుడు ఒక్కసారిగా నాలుగో సారి తల్లి అయినట్లు ప్రకటించడంతో ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఇక ఈ ఫోటోలో ఆసుపత్రి బెడ్‌లో తన పాపను హత్తుకుని ప్రేమగా ముద్దాడుతుంది గాల్ గాడోట్.. తన పాప పేరును తెలుపుతూ ఎమోషనల్ నోట్ కూడా రాసుకొచ్చింది ‘మై స్వీట్ గర్ల్ వెల్ కమ్ హోమ్. ప్రెగ్నెన్సీ అనేది సులభం కాదు. చాలా కష్టమైంది.. నేను దాన్ని పూర్తి చేశాను. నువ్వు మా జీవితాల్లోకి మరిన్ని వెలుగులు తీసుకొచ్చావ్ ఓరి.. ‘ఓరి’ అంటే హిబ్రూలో ‘నా కాంతి’ అని అర్థం. మేము ఎంతో కృతజ్ఞతతో ఉన్నాం. హౌజ్ ఆఫ్ గర్ల్స్‌కి స్వాగతం. డాడీ కూడా బాగున్నాడు’ అని గాల్ గాడోట్ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. ప్రజంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Next Story