ఆరుగురు డైరెక్టర్లతో సినిమా చేస్తున్న వివేక్ అగ్నిహోత్రి!

by Dishanational4 |
ఆరుగురు డైరెక్టర్లతో సినిమా చేస్తున్న వివేక్ అగ్నిహోత్రి!
X

దిశ, సినిమా: 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి మరో ప్రయోగం చేయబోతున్నాడు. ఈ సారి ఏకంగా ఆరుగురు దర్శకులతో కలిసి ఓ పాన్ ఇండియా సినిమా ప్రకటించాడు. వీరంతా జాతీయ అవార్డు గ్రహీతలే కావడం విశేషం. కాగా ప్రియదర్శన్, డాక్టర్ చంద్ర ప్రకాష్ ద్వివేది, జాన్ మాథ్యూ మథన్, మజు బోహరా, సంజయ్ పురాన్ సింగ్ చౌహాన్‌తోపాటు వివేక్ అగ్నిహోత్రి కూడా ఉన్నాడు. అయితే దీన్ని మూవీలా కాకుండా సిరీస్‌ల రూపంలో తీసుకొస్తారట. ఇక ఆరుగురు డైరెక్టర్‌లో సినిమా అంటే అందరూ స్టోరీ ఏమిటనే ఆలోచనలో పడ్డారు. అయితే దేశాన్ని వన్‌నేషన్‌గా ఉంచడానికి 100 సంవత్సరాలుగా తమ జీవితాలను అంకితం చేసిన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి చెప్పలేని కథలు ఈ మూవీలో చెబుతారట. విష్ణు వర్ధన్ ఇందూరి, హితేష్ ఠక్కర్ నిర్మించనున్నట్లు వివేక్ అగ్నిహోత్రి ప్రకటించాడు.


Next Story

Most Viewed