- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇకపై దానికి దూరంగా ఉంటాను.. హీరో కామెంట్స్ వైరల్

దిశ, సినిమా: ‘రామ్మా చిలకమ్మా’ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన హీరో జై ఆకాశ్. రెండో చిత్రం ‘ఆనందం’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. తర్వాత కాలంలో సినిమాలు చేసినప్పటికీ మంచి హిట్ ఒక్కటి కూడా పడలేదు. దీంతో టాలీవుడ్‌కు దూరం అయిన ఆకాశ్.. గత కొన్నేళ్ల నుంచి తమిళంలో సినిమాలు చేస్తున్నాడు. ఇక నటనతో పాటు నిర్మాతగాను వ్యవహరిస్తున్నాడు. అయితే.. చిన్న చిన్న సినిమాలకు థియేటర్లు దొరక్కపోవడంతో తానే సొంతంగా ‘ఏ క్యూబ్ మూవీస్’ అనే యాప్ లాంచ్ చేశాడు. ఇందులో తన చిత్రాలతో పాటు.. కొన్ని చిన్న సినిమాలను కూడా రిలీజ్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. గతేడాది ‘జై విజయం’ అనే చిత్రంలో హీరోగా నటించి తానే దర్శకత్వం వహించాడు జై ఆకాశ్. ఈ సినిమా ఓటీటీలో మంచి సక్సెస్ అందుకుంది. ఆ సందర్భంగా ఇటీవల సినిమా సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేసిన జై ఆకాశ్.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘నేను నటించిన ‘అమైచర్ రిటర్న్, మామరం’ సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. వీటితో పాటు మరో నాలుగు సినిమాల్లో హీరోగా అవకాశం వచ్చింది. ఇకపై దర్శకత్వానికి దూరంగా ఉండాలనుకుంటున్న’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జై ఆకాశ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.