ఆ యంగ్ హీరోను రాజశేఖర్ కూతురు పెళ్లి చేసుకుందా..? బయటపడ్డ షాకింగ్ ఫొటోలు

by Hamsa |
ఆ యంగ్ హీరోను రాజశేఖర్ కూతురు పెళ్లి చేసుకుందా..? బయటపడ్డ షాకింగ్ ఫొటోలు
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో రాజశేఖర్ తెలుగు, తమిళ భాషల్లో ఫ్యామిలీ సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ఆయన ఇద్దరు కూతుర్లు శివాని, శివాత్మికలను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అయితే ఆయన పెద్ద కూతురు శివాని వరుస చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ పలు పోస్టులు పెడుతూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, శివాని ఓ యంగ్ హీరోను పెళ్లి చేసుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే అది నిజజీవితంలో కాదు సినిమాలో భాగంగా పెళ్లి చేసుకుంది.

ఆ ఫొటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో నెట్టింట పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. ఆ యంగ్ హీరోతో రెండేళ్ల నుంచి శివాని ప్రేమలో ఉన్నట్లు పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దానికి కారణం ఆమె వరుసగా అతనితో సినిమాలు చేస్తుండటంతో.. ఈ విషయం తెలిసిన నెటిజన్లు చివరికి అతనితో రిలేషన్‌ను కన్ఫర్మ్ చేస్తావా? ఏంటి అని కామెంట్లు పెడుతున్నారు.

అసలు శివాని సినిమాలు చేసిన ఆ యంగ్ హీరో ఎవరో కాదు.. రాహుల్ విజయ్. అతనితో ఈ అమ్మడు ఇప్పటికే ఒక సినిమా చేయగా.. ఇప్పుడు మరో మూవీ చేసింది. ఈ చిత్రం మే 17న విడుదలైంది. ఈ క్రమంలోనే శివాని పెళ్లి కూతురిలా రెడీ అయిన ఫొటోలు వైరల్ కావడంతో ఆమె రిలేషన్‌‌షిప్‌కు సంబంధించిన వార్తలు జోరందుకున్నాయి. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. ఈ విషయం తెలిసిన వారు మాత్రం పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

Next Story