- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏకంగా మూడు ఓటీటీలోకి రానున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే..?

దిశ, సినిమా: క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ తెరకెక్కించడంలో మలయాళం, తమిళ చిత్ర పరిశ్రమ ముందంజలో ఉంటాయి. ఎన్ని జోనర్స్ ఉన్నప్పటికీ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ మూవీస్ స్పెషల్‌గా ఉంటాయి. ట్విస్టులు ఇస్తూ సాగే మూవీస్ ప్రేక్షకులు బాగా ఆదరిస్తుంటారు. ఇందులో భాగంగా విభిన్నమైన కాన్సెప్టుతో తాజాగా తమిళంలో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘బ్లూ స్టార్’. ఎస్. జయ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అశోక్ సెల్వన్ హీరోగా, కీర్తి పాండియన్ హీరోయిన్‌గా నటించగా పృథ్వీ పాండిరాజన్, లిజీ ఆంటోనీ, శంతను భాగ్యరాజ్, అరుణ్ బాలాజీ, ఎలాంగో కుమారవేల్, భాగవతి పెరుమై తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక జనవరి 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా.. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి హిట్ అందుకుంది. అయితే తాజాగా ‘బ్లూ స్టార్’ మూవీ ఓటీటీ లోకి రానుంది.. అది కూడా ఏకంగా మూడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో.
అందులో మొదటిది అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఫిబ్రవరి 29 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారు. దీంతో పాటుగా ‘టెంట్‌కొట్టా’, ‘సింప్లీ సౌత్’ అనే మరో రెండు తెలియని ఓటీటీల్లో కూడా ఈ చిత్రాన్ని డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నారు. అమెజాన్ ప్రైమ్‌తోపాటు ఈ రెండు ఓటీటీల్లో కూడా ఇదే ఫిబ్రవరి 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ మూవీని తెలుగులో కూడా స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.