కమల్ హాసన్‌కు హ్యాండ్ ఇచ్చిన నయనతార.. ఈమెలో ఈ కోణం కూడా ఉందా.?

by Prasanna |
కమల్ హాసన్‌కు హ్యాండ్ ఇచ్చిన నయనతార.. ఈమెలో ఈ కోణం కూడా ఉందా.?
X

దిశ, సినిమా : లేడీ సూపర్ స్టార్ నయనతార ‘జవాన్’ సక్సెస్‌తో నేషనల్ క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే షారుఖ్‌తో దోస్తీ చేస్తున్న నయన్.. కమల్ హాసన్‌కు మాత్రం హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో రాబోతున్న ‘థగ్ లైఫ్’ హీరోయిన్‌గా ముందుగా ఆమెను నిర్ణయించారు. కానీ రెమ్యూనరేషన్‌ రూ. 12కోట్లు డిమాండ్ చేయడంతో పక్కన పెట్టేసి.. ఆమె ప్లేస్‌లో త్రిషకు వెల్‌కమ్ చెప్పినట్లు సమాచారం. కాగా ఇలాంటి ఇష్యూ ఇంతకు ముందు కూడా వచ్చినట్లు తెలుస్తుంది.

కార్తీ-తమన్నా భాటియా ‘పైయా’ విషయంలోనూ ఇదే జరిగిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో మేకర్స్ చెప్పుకొచ్చారు. నయన్‌ను సంప్రదిస్తే రెమ్యూనరేషన్‌ విషయంలో తగ్గకపోవడంతో.. తమన్న చాన్స్ కొట్టేసినట్లు చెప్పారు. కాగా ఈ సినిమా సక్సెస్‌తో మిల్కీ బ్యూటీకి వరుస ఆఫర్లు వచ్చిపడ్డాయి. ఇక దళపతి విజయ్ ‘విల్లు’ విషయంలోనూ ఇలాంటి డిమాండ్‌తోనే ఉండటంతో మేకర్స్ మరొకరిని చూజ్ చేసుకోవాల్సి వచ్చిందని ప్రచారం జరిగింది.Next Story