Jr.Ntr: ఆ క్షణం మా గుండెల్లో దేశ గౌరవాన్ని మోస్తాం: తారక్

by Prasanna |
Jr.Ntr: ఆ క్షణం మా గుండెల్లో దేశ గౌరవాన్ని మోస్తాం: తారక్
X

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాను నటించిన ‘నాటు నాటు’ సాంగ్ ప్రత్యేకతల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆస్కార్ అవార్డుల ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఇటీవల అమెరికా వెళ్లిన తారక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘రెడ్ కార్పెట్‌పై నడవబోయేది ఎన్టీఆర్ లేదా కొమురం భీమ్ మాత్రమేనని నేను అనుకోవట్లేదు. యావత్ భారతదేశం మొత్తం ఆ రెడ్ కార్పెట్‌పై నడుస్తుందని అనుకుంటాం. ఆస్కార్ వేడుకల్లో పాల్గొంటున్నప్పుడూ మా గుండెల్లో మా దేశాన్ని మోస్తున్నట్లే భావిస్తాం. అందుకు మేము గర్వంగా ఫీల్ అవుతాం. మా గుండెల్లో మా దేశ గౌరవాన్ని మోస్తూ.. రెడ్ కార్పెట్‌పై నడుస్తాం. ఆస్కార్ కోసం నామినేట్ అయిన ‘నాటు నాటు’ పాటకు డాన్స్ చేయడం చాలా కష్టతరమైనది. షూటింగ్‌కు వారం రోజుల ముందునుంచే మేము ప్రాక్టీస్ మొదలుపెట్టాం. షూటింగ్ సమయంలోనూ ఎన్నోసార్లు రిహార్సల్స్ చేశాం’ అంటూ పలు విషయాలు వెల్లడించాడు.

Also Read..

సర్జరీతో పూర్తిగా మారిపోయిన హీరోయిన్ ఫేస్.. ఆమెనే భయపడిపోయింది..

Next Story