నాగచైతన్యతో విడిపోమని సమంతకు సలహా ఇచ్చింది తనేనా..? పోస్ట్ వైరల్

by sudharani |
నాగచైతన్యతో విడిపోమని సమంతకు సలహా ఇచ్చింది తనేనా..? పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనతికాలంలోనే స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. ఆ మధ్య కాలంలో మయోసైటిస్ భారీన పడిన విషయం తెలిసిందే. ఆ టైంలోనే రెండు సినిమాలు తీసి తర్వాత మూవీస్‌కు బ్రేక్ ఇచ్చి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టింది. ప్రస్తుతం సినిమాలకు రీ ఎంట్రీ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ‘ఏ మాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత.. అదే సమయంలో నాగచైతన్యతో ప్రేమలో పడింది. ఏడేళ్లు ప్రేమించుకున్న ఈ ఇద్దరు.. పెద్దల అంగీకారంతో 2017లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. తర్వాత కొన్ని అనివార్య కార్యణాల చేత 2021లో విడిపోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చి ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేశారు.

అయితే.. వీళ్లిద్దరూ విడిపోవడానికి వీళ్లే కారణమంటూ కొంత మంది పేర్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అందులో సమంత ఫ్రెండ్ మేఘన వినోద్ పేరు కూడా ఒకటి. ఈ క్రమంలోనే తాజాగా సమంత మేఘనాతొ ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘నేను తీసుకున్న మంచి నిర్ణయాలకు ఫేస్ పెడితే మేఘన’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ కావడంతో.. సమంత, నాగచైతన్య విడాకులు ఇష్యూ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.

Next Story

Most Viewed