- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘గామి’ టీజర్ రిలీజ్.. అఘోరగా ఆకట్టుకున్న విశ్వక్ సేన్

దిశ, సినిమా: మాస్ క దాస్ విశ్వక్ సేన్ సటిస్తున్న వరుస సినిమాల్లో ‘గామి’ ఒకటి. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన అన్ని అప్‌డేట్స్ ఆకట్టుకోగా.. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.
టీజర్ స్టార్టింగ్ లోనే ఓ మ్యాప్‌ను ఓపెన్ చేస్తూ.. ‘ఇదే ఈ సమస్యకు పరిష్కారం’ అనే డైలాగ్‌తో కొనసాగుతుంది. అనంతరం ఓ పెద్ద బంగ్లా కనపడుతుంది. కొంత మంది పిల్లలు వణికిపోతూ నగ్నంగా స్నానం చేస్తూ కనిపిస్తారు. ఇలా ఒక్కో పాత్రని చాలా ఇంట్రెస్టింగ్‌గా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి శంకర్ అని పిలవగా.. నల్లటి దుప్పటి కప్పుకుని కర్ర చేత పట్టుకుని విశ్వక్ సేన్ లుక్ రివీల్ అవుతుంది. ‘ఇవన్నీ దాటుకుని నా వల్ల అవుతుంది అంటారా’ అని విశ్వక్ చెప్పే డైలాగ్‌తో టీజర్ ముగుస్తోంది. ఇందులో ఎక్కువ డైలాగులు లేనప్పటికీ.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం గూస్ బంమ్స్ అని చెప్పుకోవచ్చు. సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను ఈ నెల 29న రిలీజ్ చేయనున్నారు.