మెకానిక్‌గా మారిపోయిన విశ్వక్ సేన్.. ఫొటోస్ వైరల్

by sudharani |
మెకానిక్‌గా మారిపోయిన విశ్వక్ సేన్.. ఫొటోస్ వైరల్
X

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజాగా ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మే 31 న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని.. అద్భుతమైన కలెక్షన్లు రాబడుతున్నట్లు తెలుస్తుంది. అంతే కాకుండా.. రీసెంట్‌గా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కూడా సాధించింది. కానీ కేవలం 15 రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడం విశేషం. జూన్ 14 నుంచి ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు విశ్వక్ తన 10 వ సినిమాకు సిద్ధం అయ్యాడు. విశ్వక్ హీరోగా.. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ‘మెకానిక్ రాకీ’ అనే మూవీ తెరకెక్కబోతుంది. ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తల్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ మూవీ షూటింగ్‌లో విశ్వక్ పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే కాకుండా ప్రజంట్ విశ్వక్ సేన్ మరో రెండు ప్రాజెక్టులు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే.. వాటిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్ రావాల్సి ఉంది.

Next Story

Most Viewed