ఘనంగా జరిగిన 'ఐపీఎల్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్!

by Disha Web Desk 17 |
ఘనంగా జరిగిన ఐపీఎల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్!
X

దిశ, సినిమా: బీరం వరలక్ష్మి సమర్పణలో అంకిత మీడియా హౌస్ బ్యానర్‌పై బీరం శ్రీనివాస్ నిర్మాణంలో సురేష్ లంకలపల్లి తెరకెక్కించిన సినిమా 'ఐపీఎల్'. విశ్వ కార్తికేయ, శరణ్, అవంతిక, అర్చన గౌతమ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 10న రిలీజ్ అవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో కొరియోగ్రాఫర్ గణేష్ మాట్లాడుతూ.. ఈ మూవీ టీమ్ చాలా కష్టపడ్డారని ట్రైలర్, టీజర్ చూస్తే అర్థమవుతుందని, తప్పకుండా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందన్నారు.

'అలాగే హీరోలు ఇద్దరు జెమ్స్. ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది' అని నిర్మాత డి.ఎస్ రావు తెలుపగా.. విశ్వ కార్తికేయ జాతీయ స్థాయి హీరో అవుతాడన్న ఉదయ భాస్కర్ ఈ మూవీ బిగ్ సక్సెస్ కావాలని కోరారు. చివరగా విశ్వ కార్తికేయ మాట్లాడుతూ ప్రేక్షకులు తమ సినిమాను ఆదరించి బిగ్ హిట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.



Next Story