వినాయక చవితి స్పెషల్.. ‘హనుమాన్’ నుంచి పోస్టర్ రిలీజ్

by Hamsa |
వినాయక చవితి స్పెషల్.. ‘హనుమాన్’ నుంచి పోస్టర్ రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జ నటిస్తున్న సినిమా ‘హనుమాన్’. ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచి తొలి పాన్ ఇండియా సినిమాగా రాబోతుండడంతో ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న ఏకంగా 11 భాషల్లో విడుదల కానుంది. నేడు వినాయక చవితి సందర్భంగా చిత్రయూనిట్ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. హనుమాన్’ సినిమా ప్రమోషన్స్ మొదలు పెడుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రమోషన్స్ స్టార్ట్ చేశామని తెలుపుతూ.. వినాయక చవితి పోస్టర్ ను రిలీజ్ చేశారు.

Next Story

Most Viewed