తంగలాన్ ట్రైలర్.. ప్రయోగాత్మక లుక్స్, విభిన్న యాక్టింగ్‌తో ఆకట్టుకున్న విక్రమ్

by sudharani |
తంగలాన్ ట్రైలర్.. ప్రయోగాత్మక లుక్స్, విభిన్న యాక్టింగ్‌తో ఆకట్టుకున్న విక్రమ్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, డైరెక్టర్ పా రంజిత్ కాంబోలో వస్తున్న తాజా సినిమా ‘తంగలాన్’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. ఇందులో తిరువోరు, పశుపతి, హరి కృష్ణన్, అన్భుదురై వంటి వారు కీలక పాత్రల్లో నటించగా.. మాళవికా మోహనన్ హీరోయిన్‌గా అలరించనుంది. ఇప్పటివరకు ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతోగానో ఆకట్టుకోగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. కోలీర్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF) లోని కార్మికుల జీవితాల చుట్టూ తిరిగే వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో.. పలు ప్రయోగాత్మక లుక్స్, విభిన్న యాక్టింగ్‌తో మరోసారి ఆకట్టుకున్నాడు విక్రమ్. కాగా.. ప్రజెంట్ తమిళంలో ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటుంది.Next Story