బాక్సాఫీసును షేక్ చేసిన విజయ్ ‘Leo’.. ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?

by Disha Web Desk 6 |
బాక్సాఫీసును షేక్ చేసిన విజయ్ ‘Leo’.. ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం ‘లియో’. ఈ సినిమాను డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రూపొందించాడు. లియో విడుదల కాకముందే ఎన్నో వివాదాలను ఎదుర్కొంది. అక్టోబర్ 19న థియేటర్స్‌లో విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తొలి రోజు ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందని సమాచారం. అయితే ఈ మూవీ భారీ కలెక్షన్స్‌తో విజయ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అలాగే బాక్సాఫీసును షేక్ చేసిందని తెలుస్తోంది. లియో సెవెన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ఎస్‌ఎస్ లలిత్ కుమార్. జగదీశ్ పళనిసామి నిర్మించారు. ఈ చిత్రం డిజిటల్ రైట్స్ విషయానికొస్తే.. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లియో స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : Balayya babu ‘భగవంత్ కేసరీ’ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్


Next Story

Most Viewed