ఇంటికి వచ్చి మరీ క్షమాపణలు చెప్పారు.. దివంగత ఎన్టీఆర్‌పై విజయ శాంతి ట్వీట్ వైరల్

by Disha Web Desk 7 |
ఇంటికి వచ్చి మరీ క్షమాపణలు చెప్పారు.. దివంగత ఎన్టీఆర్‌పై విజయ శాంతి ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: లేడి సూపర్ స్టార్, బీజీపీ నేత విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ రంగంలో లేడి సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఈమె.. రాజకీయ పరంగా ఫైర్ బ్రాండ్‌గా దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా విజయశాంతి ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. దివంగత ఎన్టీఆర్ తన ఇంటికి వచ్చి మరీ క్షమాపణలు చెప్పారని ఆమె పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

విజయశాంతి పెట్టిన పోస్ట్ మేరకు.. ‘‘విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న తారక రామారావు (డాక్టర్ ఎన్టీఆర్) నేను 14 సంవత్సరాల చిన్న పిల్లగా, నా సినిమా జీవిత ప్రయాణ ప్రారంభ సంవత్సరాలలో సత్యం శివం సినిమాలో చెల్లెలిగా ఎన్టీఆర్ , ఏఎన్నార్‌తో కలిసి నటించే అవకాశం కలిగింది. ఆ తర్వాత 1985లో నా ప్రతిఘటన చిత్రానికి ఉత్తమ నటిగా నంది అవార్డును ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా నాకు అందించి, అభినందించి, ప్రజాప్రాయోజిత చిత్రాలలో మరింతగా కొనసాగాలని ఆశీర్వదించారు. నటునిగా, నాయకునిగా వారిది తిరుగులేని జీవన ప్రస్థానం. ఇక ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వానికి చిన్న ఉదాహరణ.. బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రం డబ్బింగ్ ఎన్టీఆర్ ఏవీఎం స్టూడియోలో చెబుతున్నప్పుడు 1990లో నేను చిరంజీవితో అదే స్టూడియోలో సినిమా చేస్తున్నాను.

ఈ సమయంలో ఎన్టీఆర్‌ను కలిసేందుకు డబ్బింగ్ థియేటర్‌కి వెళ్లినప్పుడు, డబ్బింగ్ థియేటర్‌లో వెలుతురు లేని వాతావరణంలో వారు నన్ను సరిగా గమనించలేదని బాధపడ్డాను. కానీ ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ తర్వాత రోజు ఉదయం 6 గంటలకే మద్రాసులో మా ఇంటికి వచ్చి, (నేను ఆ ఉదయం ప్లయిట్‌కి హైదరాబాదులో షూటింగ్‌కి వెళ్లాను) అమ్మాయిని మేము చూసుకోలేదు. పొరపాటు జరిగింది, ఐయామ్ సారీ, బిడ్డకు తెలియజేయండి అని శ్రీనివాస్ ప్రసాద్‌తో చెప్పిన సంఘటన ఎన్ని సంవత్సరాలైనా గుర్తుగానే, గౌరవంగానే మిగులుతుంది. అంతేగాక, ఆ రోజు నేను హైదరాబాదులో ఉన్న ఫోన్ నెంబర్ తెలుసుకుని, ఫోన్ చేసి మరీ "జరిగింది పొరపాటు మాత్రమే అమ్మా, I am extremely sorry..." అని చెప్పినంతవరకూ.. సాటి కళాకారుల గౌరవాన్ని కాపాడే బాధ్యతను విస్మరించని ఆ మహోన్నత వ్యక్తిని ఎంతగా ప్రశంసించినా తక్కువే’’ అంటూ చెప్పుకొచ్చారు.

Read more:

ఎన్టీఆర్‌ కీర్తి అజరామరం | N.T.Rama Rao fame is eternal

Next Story