'బెదురులంక 2012' సినిమా టీజర్‌ను విడుదల చేసిన విజయ్ దేవరకొండ..

by Hamsa |
బెదురులంక 2012 సినిమా టీజర్‌ను విడుదల చేసిన విజయ్ దేవరకొండ..
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ 'RX 100' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా హిట్ అందుకోలేక పోయాడు. కాగా, కార్తికేయ 'బెదురులంక 2012' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదల పోస్టర్స్‌, సాంగ్స్ భారీ అంచనాలను పెంచేశాయి. తాజాగా, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా 'బెదురులంక 2012' టీజర్‌ను విడుదల చేస్తూ కార్తికేయకు శుభాకాంక్షలు తెలిపాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నేహా శెట్టి నటించగా.. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

Next Story