విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ టీజర్ విడుదల

by Disha Web Desk 2 |
విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ టీజర్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. సోమవారం సాయంత్రం మూవీ టీజర్‌ను విడుదల చేశారు. మిడిల్ క్లాస్ బయోపిక్‌ను తలపించేలా టీజర్‌ను రూపొందించారు. టీజర్ చివర్లో ‘హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కాలేజీ వద్ద బైకుపై దింపుతావా? అని అడిగితే.. లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దింపేస్తా’ అని విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లకు, గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా.. ఇవాళ రిలీజైన టిజర్‌ సినిమాపై మరించ హైప్ పెంచింది. ఇప్పటికే విజయ్, డైరెక్టర్ పరుశురామ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గీతా గోవిందం’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా కాలం తర్వాత వీరి కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.Next Story

Most Viewed