సింహాచలం కొండపై సందడి చేస్తున్న విజయ్ దేవరకొండ

by Disha Web Desk 7 |
సింహాచలం కొండపై సందడి చేస్తున్న విజయ్ దేవరకొండ
X

దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ, సమంత జంటగా వచ్చిన సినిమా ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్-1న రిలీజై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. సిల్వర్ స్ర్కీన్‌పై విజయ్, సమంత క్రెమిస్ట్రీకి బాక్సాఫీస్ వద్దా కాసుల వర్షం కురుస్తుంది. కేవలం మూడు రోజుల్లో రూ. 70 కోట్లు వసూళ్లు రాబట్టింది. దీంతో ‘ఖుషి’ టీం అంతా మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో బిజీ అయిపోయారు.

ఈ క్రమంలోనే వైజాగ్‌లో విజయోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయగా.. విజయ్ దేవరకొండ కేక్ కట్ చేసి తన టీంతో ఎంజాయ్ చేశారు. అనంతరం సింహాచలం పుణ్యక్షేత్రంలో విజయ్ దేవరకొండ సందడి చేశారు. సింహాచలం అప్పన్నను దర్శించుకొని ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed