లైగర్ ఎఫెక్ట్.. ఇకపై నోరుమూసుకొని ఉంటా అంటున్న Vijay Deverakonda

by Disha Web Desk 7 |
లైగర్ ఎఫెక్ట్.. ఇకపై నోరుమూసుకొని ఉంటా అంటున్న Vijay Deverakonda
X

దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘లైగర్’. ఈ మూవీ బాక్సాఫీస్ వద్దా డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందు విజయ్ యాటిట్యూడ్ చూపించాడని.. కాలు పైకి పెట్టి మరి మాట్లాడడని నెట్టింట ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక కలెక్షన్ల విషయంలో కూడా మినిమమ్ రెండు వందల కోట్ల నుంచి లెక్కిస్తున్నాను అంటూ తన ఓవర్ కాన్ఫిడెన్స్‌ను చూపించాడు. కానీ, సినిమా అనుకున్నంత హిట్ కాకపోవడంతో పాటు కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఇక లైగర్ తర్వాత విజయ్ మీడియా ముందు అంతగా రాలేదు. అప్పుడప్పుడు చిన్న చిన్న ఈవెంట్లకు మాత్రమే హాజరయ్యారు. తాజాగా మాత్రం లైగర్‌పై స్పందించాడు విజయ్.

విజయ్ దేవరకొండ, సమంత జంటగా వస్తున్న సినిమా ‘ఖుషి’. నిన్న ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌లో ‘లైగర్’ ప్లాప్ గురించి మీరు ఏం అనుకుంటున్నారని విజయ్‌ను ప్రశ్నించారు రిపోర్టర్. దీనికి స్పందించిన విజయ్.. ‘‘లైగర్ ప్లాప్ నన్ను బాధ పెట్టింది కానీ, భయపెట్టలేదు. సినీ ప్రయాణంలో ప్లాప్‌లు సార్వసాధారణం. ప్లాప్‌లు, సక్సెస్‌లు వచ్చాయని ప్రయాణాన్ని ఆపలేం కదా. ఇక నేను సైలెంట్‌గా నోరు మూసుకుని ఉంటా.. ఇది నాకు నేను వేసుకున్న శిక్ష. ఇక సినిమాల విషయాల్లో మాట్లాడను.. సినిమాలే తన గురించి మాట్లాడతాయని’’ చెప్పుకొచ్చాడు.

Also Read: పెళ్లైన వాళ్లు కూడా దాని కోసమే వెతుకులాట Payal Rajput ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. నెటిజన్లు ఫైర్‌

Next Story

Most Viewed