'#VD12'.. ఉత్కంఠరేపుతున్న కాన్సెప్ట్ పోస్టర్‌!

by srinivas |
#VD12.. ఉత్కంఠరేపుతున్న కాన్సెప్ట్ పోస్టర్‌!
X

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కలయికలో వస్తున్న చిత్రం '#VD12'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌, శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఎస్. నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్ర ప్రకటన సందర్భంగా తాజాగా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఓ వ్యక్తి పోలీసు దుస్తుల్లో ముఖానికి ముసుగు ధరించి గూఢచారిగా కనిస్తుండగా ఆ పోస్టర్ మీద 'ఐ డోంట్ నో వేర్ ఐ బిలాంగ్ టూ టెల్ యూ వూ ఐ బెట్రాయిడ్ అనోనిమస్ స్పై' అనే క్యాప్షన్ ఉంది. అలాగే సముద్రతీరంలో యుద్ధ సన్నివేశాన్ని తలపించేలా మంటల్లో దగ్ధమవుతున్న పడవలు సినిమాపై ఆసక్తి రేకెత్తించేలా కనిపిస్తున్నాయి. ఇక త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు తెలిపిన చిత్ర బృందం నటీనటులు, ఇతరత్ర వివరాలను తొందరలోనే వెల్లడిస్తామని తెలిపారు.

ఇవి కూడా చదవండి : 'బాలుగాడి లవ్ స్టోరీ'.. టీజర్‌ విడుదలచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్

Next Story