విజయ్, రష్మిక ఫొటో వివాదం.. క్షమాపణలు చెప్పిన హీరో నాని

by Disha Web Desk 6 |
విజయ్, రష్మిక ఫొటో వివాదం.. క్షమాపణలు చెప్పిన హీరో నాని
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’.దీనికి డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ట్రైలర్ భారీ అంచనాలను పెంచాయి. ఈ మూవీ డిసెంబర్ 7న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో ఇటీవల చిత్రయూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. అయితే ఈ వేడుకలో అనుహ్యంగా విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి ఉన్నా మార్ఫింగ్ ఫొటో ఒకటి స్క్రీన్‌పై కనిపించింది. దీంతో అది చూసిన వారంతా షాక్ అయ్యారు. అది గమనించిన యాంకర్ సుమ కవర్ చేసే ప్రయత్నం చేసింది. కానీ ఫొటో వివాదం మాత్రం నాని, విజయ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడిచింది.

తాజాగా, దీనిపై హీరో నాని స్పందించాడు. ‘‘ అది అసలు తెలియకుండా జరిగింది. ఆకస్మాత్తుగా అలా చూసేసరికి ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు. ఓ ఈవెంట్ కోసం చాలా మంది పని చేస్తుంటారు. అందులో అది ఎవరు ప్లాన్ చేశారని అసలు ఎందుకు వేశారనేది తెలియలేదు. అలా సడెన్‌గా చూసి ఎలా రియాక్ట్ కావాలో కూడా తెలయలేదు. విజయ్, రష్మిక ఇద్దరూ నా ఫ్రెండ్స్.. వాళ్ల గురించి అలా పబ్లిక్‌గా ఎందుకు వెస్తాము. అలాగే ఈ ఘటన కారణంగా ఎవరైనా బాధపడి ఉంటే వారికి క్షమాపణలు చెబుతున్నాను. అసలు అది జరిగి ఉండకూడదు. ఈవెంట్‌లో ఎవరు చేశారో తెలియదు. ఇప్పుడు ఆ వ్యక్తి ఉద్యోగం పోతుందని భయపడుతూ ఉండొచ్చు’’ అని చెప్పుకొచ్చాడు.

Next Story

Most Viewed