హృతిక్‌కు నేను వీరాభిమానిని.. అతన్ని కలిసేందుకే డ్యాన్స్ నేర్చుకున్నా

by Anjali |
హృతిక్‌కు నేను వీరాభిమానిని.. అతన్ని కలిసేందుకే డ్యాన్స్ నేర్చుకున్నా
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌పై తనకున్న అభిమానం ఎలాంటిదో చెప్పాడు విక్కీ కౌశల్. ఇటీవల అబుదాబిలో జరిగిన ఫిల్మ్ అవార్డ్స్ వేడుకలో ‘ఎక్ పల్ కా జీనా’ పాటకు అతనితో కలిసి స్టెప్పులేసి అభిమానులను అలరించాడు. అయితే దీనిపై తాజాగా ఓ సమావేశంలో మాట్లాడిన విక్కీ.. చిన్నప్పటి నుంచి హృతిక్ అంటే చాలా ఇష్టమని, అతన్ని చూడటానికి చాలాసార్లు సెట్‌‌కు వెళ్లినట్లు చెప్పాడు. ‘నేను అతనికి విరాభిమానిని. ‘ఎక్ పల్ కా జీనా’ సాంగ్‌కు డ్యాన్స్ చేసే పిల్లలను ఆయన తప్పకుండా కలుస్తాడని ఎవరో చెప్పారు. అదే నమ్మకంతో అతన్ని కలవడానికి ముందు మూడు రోజులపాటు డ్యాన్స్ ప్రాక్టీస్ చేశాను’ అని గుర్తుచేసుకున్నాడు. అలాగే హృతిక్‌తో డ్యాన్స్ వీడియోను షేర్ చేసిన విక్కీ.. అతన్ని కలుసుకోవడం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుందని, ఆయనెంతో మందికి స్ఫూర్తి అంటూ పొగిడేశాడు.

Read more:

Jr.NTR వివాహేతర సంబంధంపై సినీ క్రిటిక్ సంచలన ట్వీట్.. భార్య పట్టుకుంది నిజమేనా..?

రూ. 400 కోసం హాట్‌స్పాట్ అడిగిన స్టార్ హీరోయిన్

Next Story

Most Viewed